శ్రీ వాసవీ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Vasavi Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ వాసవీ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ వాసవీ స్తోత్రం ||
కైలాసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహ-
స్తంభోద్యన్ మణిమంటపే సురుచిర ప్రాంతే చ సింహాసనే |
ఆసీనం సకలాఽమరార్చితపదాం భక్తార్తి విధ్వంసినీం
వందే వాసవి కన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికాం ||
నమస్తే వాసవీ దేవీ నమస్తే విశ్వపావని |
నమస్తే వ్రతసంబద్ధా కౌమాత్రే తే నమో నమః ||
నమస్తే భయసంహారీ నమస్తే భవనాశినీ |
నమస్తే భాగ్యదా దేవీ వాసవీ తే నమో నమః ||
నమస్తే అద్భుతసంధానా నమస్తే భద్రరూపిణీ |
నమస్తే పద్మపత్రాక్షీ సుందరాంగీ నమో నమః ||
నమస్తే విబుధానందా నమస్తే భక్తరంజనీ |
నమస్తే యోగసంయుక్తా వాణిక్యాన్యా* నమో నమః ||
నమస్తే బుధసంసేవ్యా నమస్తే మంగళప్రదే |
నమస్తే శీతలాపాంగీ శాంకరీ తే నమో నమః |
నమస్తే జగన్మాతా నమస్తే కామదాయినీ |
నమస్తే భక్తనిలయా వరదే తే నమో నమః ||
నమస్తే సిద్ధసంసేవ్యా నమస్తే చారుహాసినీ |
నమస్తే అద్భుతకళ్యాణీ శర్వాణీ తే నమో నమః ||
నమస్తే భక్తసంరక్ష-దీక్షాసంబద్ధకంకణా |
నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః ||
దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామ్యార్థ సంపదాన్ |
లభతే నాఽత్ర సందేహో దేహాంతే ముక్తిమాన్ భవేత్ ||
శ్రీమాతా కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ వాసవీ స్తోత్రం
READ
శ్రీ వాసవీ స్తోత్రం
on HinduNidhi Android App