(అయ్యప్ప స్వామి భజనలు)
1. భూత నాధ సదానందా
శో|| భూత నాధ సదానందా
సర్వ భూత దయాపరా
రక్ష రక్ష మహభాహో
శాస్తే తుభ్యం నమోనమః ..3.. సార్లు
పల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి భగవాన్ శరణం భగవతి శరణం
దేవనే – దేవియే – దేవియే – దేవనే ||భగ||
1. నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా ||భగ||
2. కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
కరుణతో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్పా ||భగ||
3. మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా
సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా ||భగ||
4. నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా
కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా ||భగ||
2. కార్తీక మాసము వచ్చిందంటే
కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా
నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||
3. అది గదిగో శబరి మలా
అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా
అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల ||శరణమయ్యప్ప||
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల ||శరణమ||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది ||శరణమ||
4. శబరిమలై నౌక సాగీ పోతున్నది
పల్లవి : శభరిమలై నౌకా సాగీ పోతున్నది
అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
నామంబు పలికితే నావ సాగి పోతుంది
శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
నామంబు పలికితే నావ సాగి పోతుంది. ||శరణం||
తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
నామంబు పలికితే నావ సాగి పోతుంది ||శరణం||
కదలండి బాబు మెదలండి బాబు
అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
నామంబు పలికితే నావ సాగిపోతుంది ||శరణం||
5. కొండల్లో కొలువున్న కొండదేవరా
పల్లవి కొండల్లో కొలువున్న కొండదేవరా
మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1. కార్తీక మసాన కొండదేవరా
మేము మాలలే వేస్తాము కొండదేవరా ||కొం||
2. అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా ||కొం||
3. కరిమలై శిఖరాన కొండదేవరా
మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా ||కొం||
4. పంపానది తీరాన కొండదేవరా
మా పాపములను బాపవయ్య కొందడేవరా ||కొం||
5. పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
మేము పరవశించినామయ్య కొండదేవరా ||కొం||
6. నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా ||కొం||