|| శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రం ||
ప్రత్యక్షదైవం ప్రతిబంధనాశనం
సత్యస్వరూపం సకలార్తినాశనమ్ |
సౌఖ్యప్రదం శాంతమనోజ్ఞరూపం
సాయినాథం సద్గురుం చరణం నమామి || ౧ ||
భక్తావనం భక్తిమతాం సుభాజనం
ముక్తిప్రదం భక్తమనోహరమ్ |
విభుం జ్ఞానసుశీలరూపిణం
సాయినాథం సద్గురుం చరణం నమామి || ౨ ||
కారుణ్యమూర్తిం కరుణాయతాక్షం
కరారిమభ్యర్థిత దాసవర్గమ్ |
కామాది షడ్వర్గజితం వరేణ్యం
సాయినాథం సద్గురుం చరణం నమామి || ౩ ||
వేదాంతవేద్యం విమలాంతరంగం
ధ్యానాధిరూఢం వరసేవ్యసద్గురుమ్ |
త్యాగి మహల్సాపతి సేవితాగ్రం
సాయినాథం సద్గురుం చరణం నమామి || ౪ ||
పత్రిగ్రామే జాతం వర షిరిడి గ్రామనివాసం
శ్రీవేంకటేశ మహర్షి శిష్యమ్ |
శంకరం శుభకరం భక్తిమతాం
సాయినాథం సద్గురుం చరణం నమామి || ౫ ||
ఇతి శ్రీ సాయినాథ పంచరత్న స్తోత్రమ్ |
Found a Mistake or Error? Report it Now