లింగాష్టకం
|| లింగాష్టకం (Lingashtakam PDF Telugu with Meaning) || బ్రహ్మమురారిసురార్చిత లింగం నిర్మలభాసితశోభిత లింగమ్ | జన్మజదుఃఖవినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగమ్ || అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవమునిప్రవరార్చిత లింగం కామదహం కరుణాకర లింగమ్ | రావణదర్పవినాశన లింగం తత్ప్రణమామి సదా…