శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం
|| శ్రీ చిదంబర పంచచామర స్తోత్రం || కదంబకాననప్రియం చిదంబయా విహారిణం మదేభకుంభగుంఫితస్వడింభలాలనోత్సుకమ్ | సదంభకామఖండనం సదంబువాహినీధరం హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || ౧ || సమస్తభక్తపోషణస్వహస్తబద్ధకంకణం ప్రశస్తకీర్తివైభవం నిరస్తసజ్జనాపదమ్ | కరస్థముక్తిసాధనం శిరఃస్థచంద్రమండనం హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || ౨ || జటాకిరీటమండితం నిటాలలోచనాన్వితం పటీకృతాష్టదిక్తటం పటీరపంకలేపనమ్ | నటౌఘపూర్వభావినం కుఠారపాశధారిణం హృదంబుజే జగద్గురుం చిదంబరం విభావయే || ౩ || కురంగశాబశోభితం చిరం గజాననార్చితం పురాంగనావిచారదం వరాంగరాగరంజితమ్ | ఖరాంగజాతనాశకం తురంగమీకృతాగమం…