Download HinduNidhi App
Shri Krishna

శ్యమంతక మణి కథ

Syamantaka Mani Katha Telugu

Shri KrishnaVrat Katha (व्रत कथा संग्रह)తెలుగు
Share This

।। శ్యమంతక మణి కథ ।।

“ధర్మరాజా! ఈ ద్వాపరయుగములోని సంఘటనుగూడ వినుము” అని ఈ విధముగా చెప్పదొడంగెను. ద్వారకావాసియగు శ్రీకృష్ణుని ఒకనాడు దేవర్షి నారదుడు దర్శించి ప్రియసంభాషణలు జరుపుచు “స్వామీ సాయంసమయంబయ్యె ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీదేవి శాపంబుచే చంద్రుని చూడరాదు. గాన నిజగృహంబునకేగెద, సెలవిండు” అని బూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికుదెల్పి నారదుండు స్వర్గలోకమునకేగె.

అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని తమ పట్టణంబున చాటింపించెను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుండగుటచే నాటి రాత్రి మింటివంక చూడకయే గోష్టమునకు బోయి పాలు పిదుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబము చూచి “ఆహా! ఇక నాకెట్టి యవనింద రానున్నది” యని సంశయమున నుండెను.

కొన్నినాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీ కృష్ణదర్శనార్ధమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునకిమ్మని యడిగిన “ఇది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసంగును, ఇట్టిదీనిని ఏ యాపనికైననూ ఏ మందమతియైన నివ్వడ”నిస పాన్ముని యూరకుండెను.

అంత నౌకవాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా. శమంతకమును కంఠమున ధరించి వేటాడపడవికి జన నొక్కు సింగన మణిని మాంసఖండమని భ్రమించ వానింజంపి యా మణింగొంపోవుచుండ జాంబవంతుడను నొక భల్లూకమా సింహమును దునిమి యా మణింగొని తన కొండబిలములో వసించు తన కుమార్తెయగు జాంబవతికి కానుకగా యిచ్చెను. జాంబవతి దానిని తోడ్కొని యాటలాడుచుండెను.

మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త 30 శ్రీ కృష్ణుడు మణి తనకియ్యలేదని నా సోదరుని జంప్ రత్నమసహరించెనని పట్టణమున జా, అది కృష్ణుడు విని నాడు క్షీరంబున చంద్రబింబమును జూచిన దోష ఫలంబిదియని యెంచి బాపుకొన బంధుజనసమేతుడై యరణ్యమునకు బోయివెదకగా వొక్ట్కుడే ప్రసిన కళేబరమును సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణవిన్యాసంబును గాన్పించెను.

ఆ దారిని బట్టి పోవుచుండ నొక పర్వత గుహద్వారంబుబాసి, పరివారమునచట నిలిపి కృష్ణుడు గుహలోనికేగి అచట బాలిక వెంతనున్న మణింజూచి దానియొద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చునంతలో ఆ బాలిక యేద్వదొడంగెను.

అంత దాదియు వింత మానిసి వచ్చెననుచు కేకలువేసెను, అలికిడికి జాంబవంతుడు వచ్చి కోపావేశముతో శ్రీ కృష్ణునిపైబడి అరచుచు, సఖంబుల గ్రుచ్చుచు, కోరలం కొరుకుచు ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణందును వానింబడద్రోసి వృక్షములచేతను రాళ్లచేతను తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్లు ఇరువది ఎనిమిది దినంబులు యుద్ధమొనర్చెను.

జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింప జేసిన పురుషుడు రావణ సంహారియగు శ్రీ రామచంద్రునిగా దలచి అంజలి ఘటించి, “దేవా! భక్తజన రక్షకా! నిమ్న త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారియగు శ్రీరామచంద్రునిగా నెఱింగితిని, ఆ కాలంబున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞయొసంగిన నా బుద్ధిమాంధ్యంబున మీతో ద్వంద్వ యుద్ధము జేయవలెనని కోరుకొంటిని, కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితిరి.

అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక వత్సరములు గడుపుచు నిటనుండ నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలంబయ్యె, ప్రాణంబులు కడబట్టి, జీవితేచ్ఛ నశించినది. నన్ను క్షమించి కాపాడుము. నీకన్నావేరు దిక్కులేదు” అనుచు భీతిచే పరిపరి విధములుగా ప్రార్ధించెను.

శ్రీ కృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి అతని బాధలను పోగొట్టెను. పిదప “భల్లూకేశ్వరా! శమంతక మణి నొసంగుము వేవేగెన” అని చెప్ప, జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కూడా కానుకగా నౌసంగెను.

అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కానందము కలిగించెను. కన్యారత్నముతోడను, మణితోడను శ్రీ కృష్ణుడు పురమునకేగెను. సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యా వృత్తాంతమును జెప్పి శమంతకమణిని యొసంగెను. అంతనా సత్రాజిత్తు “అయ్యో! లేని పోని నిందమోపి దోషంబునకు బాల్పడితిని” అని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను గైకొమ్మనిన, కృష్ణుడు మణివలదని మరల నొసంగెను.

ఒక శుభముహూర్తమున సత్యభామ, జాంబవతీలను పరిణయంబాడ, నచ్చటికి వచ్చిన దేవతలు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి, మాకేమి గతి,” యని ప్రార్ధింప శ్రీ కృష్ణుడు దయాళుండై, “భాద్రపద శుద్ధ చతుర్థిన గణపతిని యథావిధిగా పూజించి, ఈ శమంతక మణి కథను విని, అక్షతలు శిరంబున దాల్చువానికి ఆనాడు ప్రమాదవశంబున చంద్రదర్శనమగుటచే వచ్చు నీలాపనిందలు పొందకుండు గాక!” అని యానతీయ దేవాదులు సంతోషించి, తమ నివాసంబులు కరిగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థియందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ విభవముకొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గాంచుచు సుఖంబుగా నుండిర”ని ధర్మరాజు, శౌనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె. సర్వేజనా స్సుఖినోభవంతు

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్యమంతక మణి కథ PDF

శ్యమంతక మణి కథ PDF

Leave a Comment