శ్యమంతక మణి కథ
।। శ్యమంతక మణి కథ ।। “ధర్మరాజా! ఈ ద్వాపరయుగములోని సంఘటనుగూడ వినుము” అని ఈ విధముగా చెప్పదొడంగెను. ద్వారకావాసియగు శ్రీకృష్ణుని ఒకనాడు దేవర్షి నారదుడు దర్శించి ప్రియసంభాషణలు జరుపుచు “స్వామీ సాయంసమయంబయ్యె ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీదేవి శాపంబుచే చంద్రుని చూడరాదు. గాన నిజగృహంబునకేగెద, సెలవిండు” అని బూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికుదెల్పి నారదుండు స్వర్గలోకమునకేగె. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని తమ పట్టణంబున చాటింపించెను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుండగుటచే నాటి రాత్రి మింటివంక చూడకయే…